![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "గుండె నిండా గుడి గంటలు" వెర్సెస్ "వంటలక్క" సీరియల్ టీమ్స్ వచ్చాయి. ఇక ఈ షోలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలును చూసేసరికి మనసు పారేసుకుంది శ్రీముఖి. "నేను బాలుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా...బాలుని చూస్తే నేను బ్లష్ ఐపోతున్నా..నా ప్రేమ కోసం ఏదైనా చేస్తా...తెల్లగా ఉంటాయి పాలు నా మనసు గెలుచుకున్నాడు బాలు..." అని బాలు మీద లవ్ ని ఎక్స్ప్రెస్ చేసింది.
బాలుకి తెలుగు రాకపోవడంతో సీరియల్ వాళ్లంతా కూడా బాలుని బాగా ఆటపట్టించారు. తెలుగులో ఎవరు ఏం మాట్లాడినా కూడా బాలుకి అస్సలు అర్ధం కాదు..అందుకే శ్రీముఖి తన బాలు పడుతున్న బాధను చూడలేక అక్షరాభ్యాసం చేయించింది స్టార్ మా పరివారం స్టేజి మీద. ఇక బియ్యంలో శ్రీముఖి తన పేరును రాయించింది బాలు చేత.. తెలుగులోనే మాట్లాడతాను, తెలుగులోనే తింటాను అని చెప్పించించింది... ఇక ఆ కార్యక్రమం అక్షరాభ్యాసంలా లేదు లవ్వాభ్యాసంలా ఉందని మిగతా సీరియల్ యాక్టర్స్ కామెంట్స్ చేశారు. అలాగే పనిలో పనిగా ఐ లవ్ యు అని కూడా చెప్పించేసుకుంది...ఇక ఈ షోలో రెండు సీరియల్ టీమ్స్ కి పిల్లో కవర్స్ కుట్టే టాస్క్ ని ఇచ్చింది. ఈ రెండు టీమ్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వాళ్ళు మాత్రం ఫుల్ జోష్ తో అన్ని సెగ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆపోజిట్ టీమ్ వంటలక్క సీరియల్ యాక్టర్స్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు.
![]() |
![]() |